ఈవీఎంలు, ఎస్ఐఆర్లపై చర్చకు రెడీనా అంటూ రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ మహా పాదయాత్రలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఓటు బచావో ర్యాలీలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకునే యత్నమని ధ్వజమెత్తారు. ఈవీఎంలు, ఎస్ఐఆర్లపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణను కాంగ్రెస్ అధిష్టానం ఏటీఎంలా మార్చుకుందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.