ప్రభుత్వ ఆసుపత్రులలో గుండె వైద్య పరికరాల కొనుగోలుకు ముప్పై నాలుగు కోట్లు
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
ప్రభుత్వ బోధనాసుపత్రులలో గుండె సంబంధిత వైద్యసేవలను మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో హృద్రోగ పీడితులకు నాణ్యమైన చికిత్స అందించేందుకు ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు వైద్య సేవల వివరాలను వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇప్పటివరకు వేయి ఏడెండ్రల కోట్లకు పైగా ఉచిత వైద్యం అందించినట్లు తెలిపారు.