అగనంపూడి ఆసుపత్రిలో నూతన వైద్య బ్లాక్ ప్రారంభోత్సవం

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా అగనంపూడి ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఐపీహెచ్ఎల్ ల్యాబొరేటరీ మరియు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ఈ నూతన భవనాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం పదకొండు గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మరియు డీసీబీ చైర్మన్ కోన తాతారావు భౌతికంగా హాజరై ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.