ఆర్యవైశ్యుల మంచితనాన్ని కొనియాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు జిల్లా పప్పులవీధిలో ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. నూతన కార్యవర్గానికి నాయకులు అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్యులు ఎప్పుడూ నలుగురికి సాయం చేసేవారే తప్ప కీడు చేయరని సోమిరెడ్డి ప్రశంసించారు.