గుజరాత్‌లో పరువు హత్య: కూతురిని కడతేర్చిన తండ్రి, సోదరుడు
రిపోర్టర్: మహేష్
స్థలం: గుజరాత్
అహ్మదాబాద్‌లో ఘోర పరువు హత్య కలకలం రేపింది. బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న వీడియో వైరల్ కావడంతో పరువు పోయిందన్న కక్షతో 22 ఏళ్ల సోఫియాను తండ్రి మహమ్మద్ ఫరూక్, సోదరుడు హబిల్ కలిసి సుత్తితో కొచ్చి దారుణంగా హత్య చేశారు. ఈ ఘాతుకాన్ని రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు యత్నించగా, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.