క్రికెట్ ఆస్ట్రేలియా రికార్డు ఆదాయం: రెండు రోజుల టెస్టులతో భారీగా నష్టం
రిపోర్టర్: రమేష్
స్థలం: సిడ్నీ
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఆరు వందల ఒక ఒక మిలియన్ డాలర్ల రికార్డు ఆదాయాన్ని ఆర్జించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ మైక్ బైర్డ్ వెల్లడించారు. యాషెస్ సిరీస్ మరియు భారత్తో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్ల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఆయన తెలిపారు. అయితే రెండు రోజుల్లోనే ముగిసిన రెండు టెస్టు మ్యాచ్ల కారణంగా సుమారు ఇరవై మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని ఆయన స్పష్టం చేశారు.