కొండపిలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: మంత్రి డోలా స్వామి
రిపోర్టర్: శివ
స్థలం: ప్రకాశం
తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో 89 మంది లబ్ధిదారులకు 30.60 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,560 మందికి 20.37 కోట్ల రూపాయల విలువైన చెక్కులను అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు.