హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత మాంసాహార వ్యర్థాలు విసిరిన నిందితుల అరెస్ట్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 బీహెచ్కే పోలీస్ హౌసింగ్ సొసైటీ వద్ద గణేష్ నిమజ్జన ఊరేగింపు మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుండగా పై అంతస్తుల నుంచి మాంసాహార వ్యర్థాలు కిందకు విసిరారు. ఈ దుశ్చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భక్తులు, స్థానికులు నిరసనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే నేతృత్వంలో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మహమ్మద్ ఇమ్రాన్ ఖురేషీ, అర్షియా బేగం, సమీనా అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కఠిన కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.