విద్యానగర్ లో కూటమి విజయం లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్లిన నాగేంద్రబాబు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: రైల్వే కోడూరు
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలోని విద్యానగర్ లో ఎన్డీఏ కూటమి ఎంపీటీసి అభ్యర్థి ఎస్. నాగేంద్రబాబు గడప గడపకూ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసి అభ్యర్థి పగడాల వెంకటేష్ తో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.