విద్యార్థులకు తీపి కబురు: ఉచిత ల్యాప్టాప్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన విజయ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: చెన్నై

కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ పథకం అమలుకు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శ్రీకారం చుట్టారని అధికారులు తెలిపారు. వెట్రి ల్యాప్టాప్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.2,000 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్ లో డిగ్రీ, డిప్లొమా అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ ల్యాప్టాప్లు అందజేయనున్నట్లు వెల్లడించారు.