హైదరాబాద్ లో ఘనంగా సత్యదేవ్ సమవర్తి టీజర్ లాంఛ్ ఈవెంట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న 16వ చిత్రం సమవర్తి టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అజయ్ నాగ్. వి దర్శకత్వంలో ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ బ్యానర్లపై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.