మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అహంకార పూరిత వ్యాఖ్యలు.. బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తెలంగాణ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. దళితులను మోసం చేశారంటూ అసత్య ఆరోపణలు చేస్తూ భౌతిక దాడులను ప్రోత్సహించేలా మాట్లాడటం దారుణమన్నారు. కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎస్సైకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.