రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ ఫామ్ హౌస్ ను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు
రిపోర్టర్: మహేష్
స్థలం: రంగారెడ్డి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన భూ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ ఫామ్‌హౌస్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ఫామ్‌హౌస్ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా, నాళాలను ఆక్రమించి చేపట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రతినిధి బృందం హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈడీ, ఐటీ నిరోధంలో ఉన్న భూములను బినామీల పేర్లతో మార్చారని విమర్శించారు.