మౌత్ ఫ్రెష్ నర్లతో తీవ్ర ముప్పు: వైద్య నిపుణుల సంచలన హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: శ్రీకాకుళం

నోటి దుర్వాసన నివారణకు వాడే చూయింగ్ గమ్స్, మౌత్ స్ప్రేలు, మౌత్ వాష్ల వల్ల దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఓరల్ అండ్ మేక్సిల్లోఫేషియల్ సర్జన్ డాక్టర్ బలగ రమేష్ నాయుడు హెచ్చరించారు. హానికర రసాయనాలు, మైక్రోప్లాస్టిక్ కణాలతో తయారయ్యే వీటిని అధికంగా వినియోగిస్తే దంతాలు, చిగుళ్లు, జీర్ణవ్యవస్థ దెబ్బతింటాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.