పాలకుల నిర్లక్ష్యపు గోతుల్లో చితికిపోతున్న సామాన్యుడి బతుకు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నరసన్నపేట
నరసన్నపేట మండల కేంద్రంలో నిత్యం అధికారులు రాకపోకలు సాగించే మెయిన్ రోడ్డులోనే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. మురుగు నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యాయి. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు స్పందించి, వెంటనే డ్రైనేజీలను శుభ్రపరిచి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు తీవ్రంగా కోరుతున్నారు.