కంటి చూపుతో చెలగాటం: చుక్కల మందుల వాడకంతో తీవ్ర ముప్పని హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

కంటిలో దురద, ఎరుపుదనం కనిపించగానే ఇష్టానుసారంగా ఐ డ్రాప్స్ వాడటం వల్ల తీవ్రమైన ముప్పు ఉంటుందని నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక సింగ్ హెచ్చరించారు. ఇలాంటి స్వీయ వైద్యం వల్ల అసలు సమస్య కరుగుముఖం పట్టకపోగా, భవిష్యత్తులో గ్లాకోమా, కంటిశుక్లం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రతిసారీ ఒకే రకమైన మందులు వాడటం సరైన పద్ధతి కాదని వైద్యులు తెలిపారు.