మనుబోలులో వైభవంగా కొనసాగుతున్న వినాయక పూజలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో రాజా వీధి వోకిల్ పేట సెంటర్లో ప్రతిష్టించిన భారీ విగ్రహాలకు మూడవరోజు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు కుమార్ శర్మ ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా చింతల పురుషోత్తం వెంకటరమణమ్మ కుమారులు, కుటుంబ సభ్యులు తదితరులు హాజరై భక్తిశ్రద్ధలతో తీర్థప్రసాదాలు స్వీకరించారు.