కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన ప్రదర్శన: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలో స్వయంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తమదైన శైలిలో మద్దతు తెలిపిన లక్షలాది మంది ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇండియా కూటమి నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షాల శ్రేణులు అందరూ ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యులైనట్లు పేర్కొంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.