నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా నిషేధిత ప్లాస్టిక్ వినియోగం
రిపోర్టర్: హరి
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకర స్థాయికి చేరిందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు మున్సిపాలిటీ కమిషనర్ గంగాప్రసాద్ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంతో పాటు కావలి, గూడూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు విచ్చలవిడిగా పేరుకుపోతున్నాయి. నగరంలో నిత్యం వస్తున్న చెత్తలో సుమారు యాభై మెట్రిక్ టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కాలువలు పూడుకుపోయి మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి.