దారుణం: కూతురితో సన్నిహితంగా ఉన్నాడంటూ ఉద్యోగిని బ్యాట్ తో కొట్టి చంపిన యజమాని
రిపోర్టర్: శివ
స్థలం: బెంగళూరు
కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తన కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడన్న కోపంతో ఫ్యాక్టరీ యజమాని ఆనంద్ రాజ్ ఉద్యోగి కిరణ్‌ను గదిలో బంధించి రాత్రంతా బ్యాట్ తో దారుణంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలై కుప్పకూలిన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.