రూ.30 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే లలితకుమారి

రిపోర్టర్: మహేష్ స్థలం: కొత్తవలస

శృంగవరపుకోట నియోజకవర్గంలో ముప్పై కోట్ల రూపాయలతో పల్లె పండుగ మూడో విడత అభివృద్ధి పనులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. కొత్తవలస మండలం రాజపాత్రునిపాలెం గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో రెండు సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు ఆమె మంగళవారం శ్రీకారం చుట్టారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.