ఎలుక మెదడులో మనిషి కణాలతో శాస్త్రవేత్తల విప్లవాత్మక ప్రయోగం

రిపోర్టర్: హరి స్థలం: అమెరికా

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన సెర్గియూ పాస్కా బృందం మానవ మెదడు రహస్యాలను ఛేదించే దిశగా ఒక విప్లవాత్మక ప్రయోగం చేపట్టింది. ల్యాబ్‌లో మనిషి కణాలతో తయారు చేసిన కోర్టికల్ ఆర్గానోయిడ్ అనే చిన్న త్రీడీ మానవ మెదడు కణజాలాన్ని ఒక ఎలుక తలలో అమర్చారు. మూడు నెలల తర్వాత పరిశీలించగా, ఆ మానవ కణజాలం ఎలుక మెదడులో తొంబై శాతానికి పైగా ఆక్రమించి దాని నాడీ వ్యవస్థతో పూర్తిగా అనుసంధానమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.