కార్నెల్ యూనివర్సిటీలో కలకలం: టాప్ లీడర్లపై అవిశ్వాస తీర్మానం ఆమోదం

రిపోర్టర్: సునీల్ స్థలం: ఇథాకా

కార్నెల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన అఘాయత్యం ఘటనపై యాజమాన్యం వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడంతో ఫ్యాకల్టీ సెనేట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. యూనివర్సిటీ ప్రెసిడెంట్ మైఖేల్ కోట్లికాఫ్ తోపాటు టాప్ లీడర్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. లైంగిక వేధింపుల నిరోధక చర్యల్ లో వైఫల్యం చెందారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్లు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.