రుద్రకోటలో దళిత శ్మశాన వాటిక భూముల పరిరక్షణకు పోరాటం: ఎస్ మల్లి హెచ్చరిక
రిపోర్టర్: సురేష్
స్థలం: కావలి
కావలి మండలం రుద్రకోటలోని శ్మశాన వాటిక భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి స్పష్టం చేశారు. ఆదివారం ఆ స్థలాన్ని పరిశీలించి మాట్లాడిన ఆయన, ఆ భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితుల హక్కుల కోసం చివరి వరకు పోరాడుతామని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు.