బోనకల్ ప్రభుత్వ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం
బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ అంతోటి తిరుపతిరావు ఆధ్వర్యంలో, ప్రిన్సిపాల్ లింగంనేని నళినిశ్రీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రిన్సిపాల్ కొనియాడారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత హక్కులు, ఆత్మగౌరవం కోసం ధైర్యంగా నిలబడాలని విద్యార్థులకు సూచించారు.