కేసీఆర్ కుటుంబం ఫాంహౌస్ లలో కూర్చుని వేల కోట్లు కొల్లగొట్టింది

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ఫాంహౌస్‌లలో కూర్చుని వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత రమ్యా రావు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ల అవినీతి, అక్రమాలు, బినామీ ఆస్తులపై ఆమె మండిపడ్డారు. కుదురుపాక గ్రామంలో ముంపునకు సంబంధం లేకున్నా సంతోష్ రావు కుటుంబం అక్రమంగా 8 ప్లాట్ల పరిహారం పొందిందని, అఫిడవిట్లలో ఆస్తులను దాచారని రమ్యా రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.