యాదాద్రి జిల్లాలో రోడ్డు దుస్థితి: సీసీ రోడ్డును మట్టి రోడ్డుగా మార్చిన అధికారులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: భూదాన్ పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని వెంకటరమణ కాలనీలో లక్షలు వెచ్చించి నిర్మించిన సీసీ రోడ్డును మిషన్ భగీరథ పనుల పేరుతో తవ్వి ధ్వంసం చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పనులు ముగిసిన తర్వాత కూడా రోడ్డును పునరుద్ధరించకుండా కేవలం మట్టితో పూడ్చడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు వాపోయారు.