త్రీడీ సాంకేతికత ద్వారా శ్రీవారి కైంకర్యాలు వీక్షించిన చంద్రబాబు
రిపోర్టర్: మహేష్
స్థలం: శ్రీకాకుళం
తిరుమల పర్యటనలో భాగంగా పిలిగ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీవారికి నిర్వహించే నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు అలాగే తిరుమలలోని వివిధ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను అత్యాధునిక త్రీడీ సాంకేతికత ద్వారా ఆయన పరిశీలించారు. వర్చువల్ రియాలిటీ విధానం ద్వారా స్వామివారి సేవలను వీక్షించి సంబంధిత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.