నవంబరు 1న పురపోరు ఎన్నికలు: అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

నవంబరు 1న జరిగే పురపోరు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున్ తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నూట పట్టణ స్థానిక సంస్థల్లో ఎనిమిది ఏకగ్రీవం కాగా, మిగతా తొంబై రెండు స్థానాల్లో పోలింగ్కు సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల నివేదిక ఆధారంగా నవంబరు 2న కూడా పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.