మున్నార్‌లో అరుదైన నీలకురింజి పూలు చూసిన అనూరాగ్ ఠాకూర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: కేరళ
కేరళలోని మున్నార్‌లో 12 ఏళ్లకు ఒకసారి పూసే అరుదైన నీలకురింజి పూలను మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అనూరాగ్ ఠాకూర్ తన సతీమణితో కలిసి సందర్శించారు. కొరండ్కాడ్ కొండల్లో వికసించిన ఈ అద్భుత పూల అందాలను తిలకించి సెల్ఫీ దిగారు. విదేశీ పర్యటనలకు వెళ్లే బదులు ముందుగా దేశాన్ని చుట్టి చూడాలంటూ 'దేఖో అప్నా దేశ్' నినాదంతో ఆయన ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.