ఘనంగా వైఎస్ షర్మిల కుమార్తె నిశ్చితార్థ వేడుక
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించినట్లు వైఎస్ షర్మిల వెల్లడించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఈ కార్యక్రమం అట్టహాసంగా ముగిసిందని ఆమె పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు.