పెరిగిపోయిన ఉల్లి ధరలతో సామాన్యుల కంట కన్నీరు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఉల్లి ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.24 ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.70కి చేరుకుంది. బందరు, బెంగళూరు ప్రాంతాల నుంచి దిగుమతులు తగ్గిపోవడం, రవాణా భారం పెరగడంతోనే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదల కారణంగా సామాన్యులు ఉల్లి కొనుగోలు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు.