కీలక బాధ్యతలు అప్పగింత: వాసవి క్లబ్ ఎన్నికల అధికారిగా కొత్త వెంకటేశ్వరరావు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వీ106ఏ 2027 గవర్నర్ ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది కొత్త వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ అధ్యక్షుడు వాసువియన్ సిద్ధ సూర్యప్రకాష్రావు ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఎన్నికల నిర్వహణ కోసం ఎనిమిది మంది ఐఈసీ అధికారులను నియమించారు. తదుపరి విధివిధానాలు, నామినేషన్లపై చర్చించేందుకు అక్టోబర్ 11న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రకటించగా, క్లబ్ సభ్యులు ఈ నియామకంపై హర్షం వ్యక్తం చేశారు.