భువనగిరి రేణుక ఎల్లమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తజనం
రిపోర్టర్: P.srinu
స్థలం: భువనగిరి
భువనగిరి పట్టణ శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.