ఆస్తుల వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్: జగన్ను ట్యాగ్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ఆస్తుల వివాదంపై వైఎస్ షర్మిల తన సోదరుడు జగన్ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తనది కాని దానికోసం ఆశపడే నీచత్వం తనది కాదని పేర్కొంటూ, యలహంక ఆస్తి పూర్తిగా తన వాటాయేనని స్పష్టం చేశారన్నారు. కుమార్తె వివాహం అదే ఇంట్లో జరగాలని కోరుకున్నప్పటికీ, వివాదాల నేపథ్యంలో వేరే వేదికను ఎంచుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.