సినీ సర్కిల్లో సంచలనం: షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా నుంచి అనిరుధ్ ఔట్
రిపోర్టర్: మహేష్
స్థలం: చెన్నై
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తోన్న కింగ్ సినిమా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. దక్షిణాది చిత్రాలతో బిజీగా ఉండటం, తగినంత సమయం కేటాయించలేకపోవడంతో ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో సచిన్ జిగర్ జోడీని సంగీత దర్శకులుగా ఎంపిక చేసినట్లు బీటౌన్ లో ప్రచారం జరుగుతోంది.