ప్రయాణికులకు తీపి కబురు: ఆర్టీసీ సేవల కోసం వినూత్న క్యూఆర్ కోడ్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

ప్రయాణికులకు మరింత మెరుగైన మరియు ఆధునిక సేవలను అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ఒకే ఒక్క క్యూఆర్ కోడ్ ద్వారా ఆర్టీసీకి సంబంధించిన వివిధ యాప్లు అలాగే సోషల్ మీడియా వేదికల లింక్స్ అన్నీ సులభంగా పొందేలా వినూత్న మార్పులు చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది.