టెలికాం విభాగం డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ రద్దు

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

టెలికాం శాఖలో కీలక విధాన నిర్ణయాలు తీసుకునే అత్యన్నత అంతర్-విభాగ సంస్థ అయిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 1989లో టెలికాం కమిషన్‌గా ఏర్పాటైన ఈ సంస్థను 2018లో డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌గా పేరు మార్చారు. స్పెక్ట్రమ్ ధరలు, పాలసీ వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకునే ఈ కమిషన్ సెప్టెంబర్ 3న చివరి సమావేశాన్ని నిర్వహించింది.