న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో వీడియోల ప్రచారంపై హైకోర్టు తీవ్ర అసహనం
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
అమరావతి హైకోర్టులో జరిగిన విచారణలపై న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేయడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఫీజుల చెల్లింపు పిటిషన్ విచారణ సందర్భంగా జడ్జిలపై దురుద్దేశాలు ఆపాదిస్తూ ప్రచారం చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. న్యాయవాదులకు ఫీజుల చెల్లింపు తీర్పులను అధ్యయనం చేయాలని కోరితే ఆరోపణలు చేయడం సరికాదని తేల్చిచెప్పడంతో న్యాయవాది శ్రావణ్‌కుమార్ కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు.