'జియో యూజర్లకు గుడ్ న్యూస్..': 12 నెలల పాటు క్యాన్వా ఉచితం!
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఇండియా
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థులు, డిజిటల్ డిజైనర్లను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ డిజైనింగ్ ప్లాట్‌ఫామ్ క్యాన్వాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అర్హత ఉన్న జియో యూజర్లకు 12 నెలల పాటు క్యాన్వా ప్రో మరియు ప్రో లైట్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. రూ.399 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే యూజర్లు మైజియో యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చని స్పష్టం చేసింది.