బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరియు భారీ వర్షాల హెచ్చరిక

రిపోర్టర్: విజయ్ స్థలం: విశాఖపట్నం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వైపు దూసుకొస్తోందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 23 రాత్రి విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.