'ప్రజా పాలనను అందిస్తున్నాం': హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సామాజిక న్యాయమే పునాదిగా ప్రభుత్వం పారదర్శక ప్రజా పాలన అందిస్తోందని స్పష్టం చేశారు.