ఓటు వేయకుండా జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటూ మంత్రి సత్యకుమార్ ఫైర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

స్వస్థలం పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకోకుండా మాజీ సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. జగన్ ప్రవర్తన రాజకీయాల్ లో ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడికి సరిపోయేలా ఉందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పులివెందులలో ఎన్నికలు జరిగిన తీరుకు నిరసనగా తాను ఓటు వేయలేదని చెప్పుకున్న జగన్ మిగిలిన చోట్ల ఎన్నికలు సవ్యంగా జరిగాయని అంగీకరించినట్లయిందని మంత్రి స్పష్టం చేశారు.