మేడ్చల్ సర్కిల్ లో తీవ్ర తాగునీటి కొరత: బిందెలు పట్టుకుని వీధుల్ లో నిలబడిన జనం

రిపోర్టర్: సురేష్ స్థలం: Medchal

మేడ్చల్ సర్కిల్-60 పరిధిలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు అధికారుల సమన్వయ లోపం కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోయారు. సమస్యపై ప్రశ్నిస్తే ఏఈ మమత నిర్లక్ష్యంగా సమాధానం దాటవేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.