భారీ వర్షాల బీభత్సం: కట్టలేరు వాగు ఉధృతితో ఇరవై గ్రామాలకు నిలిచిన రాకపోకలు
రిపోర్టర్: మహేష్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
మురసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మరియు తిరువూరు నియోజకవర్గాల్ లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. గంపలగూడెం మండలంలో కట్టలేరు వాగు ఉధృతి పెరగడంతో సుమారు ఇరవై గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారని అధికారులు వెల్లడించారు. ఈ వరద ఉధృతి కారణంగా ప్రయాణికులు ముప్ పై కిలోమీటర్లు చుట్టి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.