అనకాపల్లిలో భారీగా గంజాయి పట్టివేత: ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Anakapalli

అనకాపల్లి జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చేపట్టిన తనిఖీల్లో సుమారు 3 కోట్ల రూపాయల విలువైన 600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతామని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.