కివీస్ పై సెంచరీ చేసేందుకు రోహిత్ కంటే కోహ్లీకే మెరుగైన అవకాశాలు: పుజారా

రిపోర్టర్: కిరణ్ స్థలం: న్యూఢిల్లీ

న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీనే సెంచరీ సాధించే అవకాశం ఎక్కువగా ఉందని మాజీ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డారు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగడం కోహ్లీకి కలిసివస్తుందని తెలిపారు. ఓపెనర్గా బరిలోకి దిగే రోహిత్ శర్మ పవర్ప్లేలో దూకుడుగా ఆడాల్సి ఉంటుందని, అయితే న్యూజిలాండ్ పిచ్లపై అతడి పాత్ర మారవచ్చని జియోస్టార్ ఇంటర్వ్యూలో పుజారా పేర్కొన్నారు.