ఉత్తరాంధ్రలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీకాకుళం

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న పున్నాన రాంబాబును శ్రీకాకుళం జిల్లా జేఆర్పురం పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ సీహెచ్.వివేకానంద తెలిపారు. జి.సిగడాం మండలం నడిమివలస వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతడి నుంచి 26.3 తులాల బంగారం, 1.29 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి రాంబాబు ఈ నేరాలకు పాల్పడుతున్నాడని, అతడిపై రాష్ట్రవ్యాప్తంగా 110 కేసులు ఉన్నాయని డీఎస్పీ స్పష్టం చేశారు.