దస్తురాబాద్లో విశ్రాంత ఉపాధ్యాయులకు ఘనంగా ఆత్మీయ సన్మానం

రిపోర్టర్: Gone Rachana స్థలం: దస్తురాబాద్

దస్తురాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు కోటవేణు నేతృత్వంలో మండలంలోని విశ్రాంత ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి, వారి విద్యా సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు.

గత పదహారేళ్లుగా ప్రతి ఏటా విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గంగాధర్, విశ్రాంత ఉపాధ్యాయులు శంకరయ్య, సత్యనారాయణ, లక్ష్మీ నరసయ్య, నారాయణ, గంగారాం, భూపతి రెడ్డితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.