పట్టణ ఇళ్ల నిర్మాణంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం కింద ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా దిల్లీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి తోఖాన్ సాహు చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి ఈ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం, దార్శనికత ఫలితంగానే రాష్ట్రం ఈ అద్భుతమైన జాతీయ ప్రగతిని సాధించిందని ఆయన వెల్లడించారు.